- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
36వ జాతీయ క్రీడా ప్రారంభోత్సవం..
గాంధీనగర్: 36వ జాతీయ క్రీడా ప్రారంభోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గురువారం సంస్కృతిక, సంగీత కార్యక్రమాల నడుమ అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరై.. క్రీడలను ప్రారంభించారు. అలాగే క్రీడను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, రెజ్లర్ రవి కుమార్ దహియా తదితరులు పాల్గొన్నారు. కాగా, సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు గుజరాత్‌లోని అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, భావ్‌నగర్ ప్రాంతాల్లో క్రీడా పోటీలు జరగనున్నాయి.
దాదాపు 7 వేలకు పైగా అథ్లెట్లు జాతీయ క్రీడల్లో పాల్గొననున్నారు. రెండేళ్లకు ఒకసారి జరిగే జాతీయ క్రీడలు దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత మళ్లీ ప్రారంభమయ్యాయి. 2015లో కేరళలో 35వ జాతీయ క్రీడలు జరిగాయి. 2016లో గోవాలో 36వ జాతీయ క్రీడలు నిర్వహించాల్సి ఉండగా.. పలు సమస్యల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. 2020లో కరోనా వల్ల వాయిదా పడింది.