Asaduddin Owaisi : ప్రధాని మోడీ ఆర్టికల్ 26 చదువుకుంటే.. ఆ విషయం తెలిసిపోతుంది : ఒవైసీ

by Hajipasha |   ( Updated:2024-12-14 11:55:46.0  )
Asaduddin Owaisi : ప్రధాని మోడీ ఆర్టికల్ 26 చదువుకుంటే.. ఆ విషయం తెలిసిపోతుంది : ఒవైసీ
X

దిశ, నేషనల్ బ్యూరో : వక్ఫ్(Waqf) బోర్డుతో రాజ్యాంగానికి సంబంధం లేదని ప్రధాని మోడీ(PM Modi) చేసిన వ్యాఖ్యలపై మజ్లిస్ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) ఫైర్ అయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఒకసారి రాజ్యాంగంలోని ఆర్టికల్ 26(Article 26)ను చదువుకోవాలని ప్రధాని మోడీకి ఆయన సూచించారు. ఇంతకీ ప్రధానికి రాజ్యాంగ పాఠాలు చెబుతున్నది ఎవరని ప్రశ్నించారు. శనివారం లోక్‌సభలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘‘దేశ ప్రజలకు మతస్వేచ్ఛ ఉందని ఆర్టికల్ 26 చెబుతోంది. మతపరమైన, స్వచ్ఛంద సేవాపరమైన కార్యకలాపాల కోసం సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను ఆ ఆర్టికల్ దేశ ప్రజలను ఇచ్చింది. అయినా వక్ఫ్‌కు రాజ్యాంగంతో సంబంధం లేదని మోడీ అంటున్నారు’’ అని ఆయన మండిపడ్డారు.

‘‘మీకు బలం ఉంది కదా అని వక్ఫ్ ఆస్తులను బల ప్రయోగంతో దోచేసే ప్రయత్నం చేస్తున్నారు. మీ లక్ష్యం అదే’’ అని ఒవైసీ ఆరోపించారు. బీజేపీ భుజానికి ఎత్తుకున్న జాతీయవాదం అనేది సాంస్కృతికపరమైంది కాదని.. అది మతపరమైందని వ్యాఖ్యానించారు. మసీదుల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి, మూక దాడులు చేయించి.. దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుట్రలు జరుగుతున్నాయని అసదుద్దీన్ ఆరోపించారు. దేశంలోని మైనారిటీలు అధికారాన్ని కలిగి ఉండాలని ఏ ఒక్కరూ కోరుకోవడం లేదన్నారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed