PM Modi: పారిస్ ఒలింపిక్స్ క్రీడా చరిత్రలో మేలిమలుపు: ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు

by Shiva |
PM Modi: పారిస్ ఒలింపిక్స్ క్రీడా చరిత్రలో మేలిమలుపు: ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పారిస్ ఒలింపిక్స్ భారతదేశ క్రీడా చరిత్రలో ఓ మేలిమలుపు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీలో ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పతాకాలు గెలుచుకున్న అందరికీ ముందుగా అభినందనలు తెలిపారు. క్రీడాకారులంతా శక్తి వంచన లేకుండా పోరాడటం గర్వకారణంగా ఉందని అన్నారు. పారిస్ ఒలింపిక్స్‌తో భారత క్రీడారంగంలో చాలా మార్పులు వస్తాయని తెలిపారు. క్రీడా రంగానికి బడ్జెట్‌లో ఏటా నిధులు పెంచుతున్నామని పేర్కొన్నారు.

భారత్‌లో 2036లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. కేవలం 21 ఏళ్ల వయసులోనే రెజ్లర్ అమన్ కాంస్య పతకాన్ని సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఇక షూటింగ్‌లో మను బాకర్ అద్భుతం చేసిందని ఏకంగా ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు కైవసం చేసుకున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించిందని అన్నారు. అదేవిధంగా జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా మరోసారి ఒలింపిక్ మెడల్ సాధించి యువతకు రోల్ మోడల్ అయ్యాడని అన్నారు. ఇక రెజ్లర్ వినేష్ ఫోగట్ ఫైనల్‌లోకి వెళ్లి చరిత్ర సృష్టించిందని ఆమె పోరాటం అనన్యసామాన్యమని కొనియాడారు. ఒలింపిక్స్ విజేతలకు దేశ ప్రజలంతా జేజేలు పలుకుతున్నారని ప్రధాని మోడీ అన్నారు.

Advertisement

Next Story