- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సేలా’.. చైనా ఆర్మీ ఆటకట్టించేలా ?
దిశ, నేషనల్ బ్యూరో : ప్రపంచంలోనే అత్యంత పొడవైన డబుల్ లేన్ టన్నెల్ ‘సేలా’ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఈటానగర్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ప్రధాని మోడీ పచ్చజెండా ఊపిన వెంటనే సెలా టన్నెల్‌లో నుంచి అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ ట్రాన్స్ పోర్ట్ బస్సు ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆరు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన దాదాపు రూ.55వేల కోట్లు విలువైన పలు ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించి శంకుస్థాపన చేశారు. దేశంలోనే అత్యంత ఎత్తైన ఆనకట్టగా నిలవనున్న 2880 మెగావాట్ల ‘దిబాంగ్’ బహుళార్థసాధక జలవిద్యుత్ ప్రాజెక్టుకు మోడీ భూమిపూజ చేశారు. ఈశాన్య రాష్ట్రాల కోసం కొత్త పారిశ్రామిక అభివృద్ధి పథకం ‘ఉన్నతి’ స్కీంను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. రూ.10,000 కోట్ల విలువైన ఈ పథకం కొత్త పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త తయారీ, సేవల యూనిట్ల స్థాపనకు తోడ్పడుతుంది. కార్యక్రమంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు, గవర్నర్ కేటీ పర్నాయక్, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు.
2019 ఫిబ్రవరి 9న..
‘సేలా’ టన్నెల్ ప్రాజెక్టుకు 2019 సంవత్సరం ఫిబ్రవరి 9న ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. రూ.825 కోట్ల వ్యయంతో ఈ టన్నెల్‌ను సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్‌వో) నిర్మించింది. అయితే కరోనా సంక్షోభం సహా వివిధ కారణాల వల్ల పనులు ఆలస్యమయ్యాయి. భారత్ - చైనా సరిహద్దులో ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా ఆయుధాలు, బలగాలను వేగంగా తరలించేందుకు ఈ టన్నెల్ ఉపయుక్తంగా ఉంటుంది. దీనివల్ల సరిహద్దు ప్రాంత ప్రజలకు సామాజిక, ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది.
సేలా టన్నెల్ విశేషాలు..
* సేలా టన్నెల్‌ను సముద్ర మట్టానికి 13వేల అడుగుల ఎత్తులో పర్వతాల మధ్య నిర్మించారు.
* ఈ టన్నెల్‌లో భాగంగా రెండు సొరంగాలు ఉన్నాయి. టన్నెల్-1 సింగిల్ ట్యూబ్‌తో 1,003 మీటర్ల పొడవు ఉండగా.. టన్నెల్-2 రెండు సొరంగమార్గాలతో 1,595 మీటర్ల పొడవు ఉంది. ఈ రెండు టన్నెల్స్‌ను కలిపే రోడ్డు పొడవు 1200 మీటర్లు. టన్నెల్-2 సొరంగమార్గాల్లో ఒకదాన్ని సాధారణ ట్రాఫిక్‌కు, మరో దాన్ని ఎమర్జెన్సీ సర్వీసులకు కేటాయించారు.
* పర్వతాల మధ్య సేలా పాస్‌కు 400 మీటర్ల దిగువన ఈ టన్నెల్‌ను నిర్మించారు.
* ఈ టన్నెల్ వల్ల చలికాలంలోనూ బార్డర్ వైపుగా ఆర్మీ రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదు.
* ఈ టన్నెల్ వల్ల చైనా బార్డర్‌లోని తవాంగ్-దిరాంగ్ పట్టణాల మధ్య 12 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. ప్రయాణ సమయం 90 నిమిషాల మేర ఆదా అవుతుంది.
* ఈ టన్నెల్‌లో వెంటిలేషన్ వ్యవస్థలు, లైటింగ్, అగ్నిమాపక పరికరాలు కూడా ఉన్నాయి.
* అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ పట్టణం చైనా సరిహద్దుల్లో ఉంటుంది. ఈ సొరంగమార్గాన్ని వాడుకొని అత్యవసర పరిస్థితుల్లో భారత దళాలు స్పీడుగా సరిహద్దులకు చేరుకోవచ్చు.
* చైనా సరిహద్దులు ఎత్తుగా ఉండటంతో ఆ దేశం బలగాలు సులభంగా.. మన ఆర్మీ కదలికలను చూడగలవు. ఇప్పుడు సొరంగమార్గం అందుబాటులోకి రావడంతో చైనా ఆర్మీకి ఇకపై ఆ అవకాశం ఉండబోదు.