సుప్రీంకోర్టు భవనాన్ని కూల్చివేయద్దంటూ పిటిషన్ దాఖలు

by S Gopi |
సుప్రీంకోర్టు భవనాన్ని కూల్చివేయద్దంటూ పిటిషన్ దాఖలు
X

దిశ, నేషనల్ బ్యూరో: సుప్రీంకోర్టు భవనాన్ని కూల్చివేయవద్దని, దానికి బదులుగా మరో చోట కొత్త భవనాన్ని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ భారత అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. ఉన్న భవనాన్ని కూల్చడానికి బదులు మరోచోట కొత్త భవనం నిర్మించవచ్చని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పుడున్న భవనాన్ని ఇతర అవసరాలకు వాడుకోవచ్చని పిటిషనర్ వెల్లడించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోని నిర్మితమైన ప్రధాన కట్టడాల్లో సుప్రీంకోర్టు కూడా ఒకటి. దీన్ని కూల్చడం అంటే చరిత్రలో ఒక భాగాన్ని ధ్వంసం చేసినట్టే. ప్రస్తుతం అద్దె ద్వారా కార్యకలాపాలు జరుగుతున్న పలు కోర్టులు, ట్రెబ్యునళ్లు, ప్రభుత్వ ఆఫీసులకు ఈ భవనంలో వసతి ఏర్పాటు చేయవచ్చని పిటిషనర్ తన పిటిషన్‌లో వివరించారు. సుప్రీంకోర్టు భవనాన్ని కూల్చివేయడానికి బదులు మరో ప్రయోజనం కోసం ఉపయోగించాలని పిటిషనర్ కేకే రమేష్ చెప్పారు. ప్రస్తుతం ఉన్నత న్యాయస్థానంలో 17 కోర్టు గదులు, రెండు రిజిస్ట్రార్ కోర్టు గదులు ఉన్నాయని, కేంద్రం మొత్తం భవనాన్ని కూల్చివేయబోతోంది. నాలుగు రిజిస్ట్రార్ కోర్టు గదులతో 27 కోర్టు గదులను పునర్నిర్మించేందుకు రూ. 800 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. సుప్రీంకోర్టులో కేసుల సంఖ్య ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో 10 ఏళ్ల తర్వాత ఈ గదులు కూడా సరిపోవని ఆయన వెల్లడించారు. కాగా, ఇప్పటికీ ఇంకా కొత్త భవనం గురించిన మోడల్‌ను ప్రభుత్వం విడుదల చేయలేదు, ప్రజలు, బార్ అసోసియేషన్‌లతో కూడా దీనిపై చర్చలు నిర్వహించలేదు.



Next Story