- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Jaishankar: శాంతి పరిరక్షణే సమర్థమంతమైన సాధనం- జైశంకర్

దిశ, నేషనల్ బ్యూరో: అంతర్జాతీయ శాంతిభద్రతలను కాపాడటానికి శాంతి పరిరక్షణే సమర్థమంతమైన సాధనమని భారత్ భావిస్తోందని విదేశాంగ మంత్రి జైంకర్ అన్నారు. అలాంటి కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం వారిని వైవిధ్యభరితంగా, సమగ్రంగా మారుస్తోందన్నారు. "గ్లోబల్ సౌత్ నుండి మహిళా శాంతి పరిరక్షకులు"( Women peacekeepers from the Global South) అనే అంశంపై భారత్ నిర్వహిస్తున్న సమావేశంలో జైశంకర్ ప్రసంగించారు. శాంతిభద్రతలను పెంపొందించేందుకు గ్లోబల్ సౌత్ దేశాలకు, యూఎన్ శాంతి పరిరక్షణ దళాలకు భారత్ మద్దతిస్తుందన్నారు. ఈ చర్చలు బెర్లిన్‌లో జరిగే శాంతి పరిరక్షణ మంత్రివర్గ సమావేశం, ఈ ఏడాది చివర్లో న్యూయార్క్ లో జరిగే శాంతి నిర్మాణ సమీక్షలో ఫలితాలను రూపొందించేందుకు సహాయపడతాయన్నారు. అనేక దశాబ్దాలుగా భారత్ యూఎన్ శాంతి పరిరక్షణతో భారత్ కు అనుబంధం ఉందన్నారు. 1950ల నుండి భారత్ 50కి పైగా మిషన్లలో 2.9 లక్షల మందికి పైగా శాంతి పరిరక్షకులను అందించిందన్నారు. 11 క్రియాశీల యూఎన్ మిషనల్లో ప్రస్తుతం 5 వేలకు పైగా భారతీయులు ఉన్నారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ మిషన్లలో 180 మంద భారతీయులను కోల్పోయినట్లు తెలిపారు. 2007లో లైబీరియాలో పూర్తిగా మహిళా పోలీసు యూనిట్‌ను మోహరించిన తొలి దేశంగా భారత్ నిలిచిందన్నారు. ప్రస్తుతం 150 మందికి పైగా మహిళా శాంతి పరిరక్షకులు.. కాంగో, దక్షిణ సూడాన్, లెబనాన్, గోలన్ హైట్స్, పశ్చిమ సహారా, అబేయ్‌లలోని మిషన్లలో ఉన్నట్లు వెల్లడించారు.
శాంతి పరిరక్షణకు కట్టుబడి..
భారత విదేశాంగ విధానం శాంతి పరిరక్షణకు కట్టుబడి ఉంని జైశంకర్ అన్నారు. సంభాషణ, దౌత్యం, సహకారంపైనే భారత్ పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచం ఒకే కుటుంబం అనే నమ్మకంతో భారత్ ఉందని.. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణకు తోడ్పడుతూనే ఉంటామన్నారు. గ్లోబల్ సౌత్‌లో కీలక భాగస్వామి అయిన భారత్.. తమ అనుభవం, వనరులు, నైపుణ్యాన్ని ఇతర దేశాల అభివృద్ధికి, సమిష్టి కృషికి దోహదపడుతోందన్నారు. ఇకపోతే, కేంద్ర ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితి సంయుక్తంగా ఈ సదస్సుని నిర్వహించింది. శాంతి పరిరక్షక కార్యకలాపాల్లో మహిళల పాత్ర, వారి భాగస్వామ్యాన్ని పెంచేందుకు చర్చించే వ్యూహాల గురించి 35 దేశాల నుండి మహిళా శాంతి పరిరక్షకులు ఈ సదస్సులో పాల్గొన్నారు. గ్లోబల్ సౌత్‌లో మహిళా శాంతి పరిరక్షకుల అనుభవాలను పంచుకోవడం, సహకరాన్ని మెరుగుపరచడంతోపాటు యూఎన్ శాంతి పరిరక్షక దళాల్లో మహిళల పాత్రను బలోపేతం చేయడమే ఈ సదస్సు లక్ష్యం.