- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘గరీబీ హఠావో’ను నిజం చేసిన ఘనత మోడీ సర్కారుదే : రాష్ట్రపతి
దిశ, నేషనల్ బ్యూరో : గత పదేళ్లలో 25 కోట్ల మంది దేశ ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా దేశం ముందుకెళ్తోందన్నారు. ‘‘మన చిన్నతనం నుంచీ ‘గరీబీ హఠావో’ నినాదాన్ని వింటున్నాం. కానీ, జీవితంలో తొలిసారి పేదరికాన్ని పెద్ద ఎత్తున పారదోలడం చూస్తున్నాం’’ అని తెలిపారు. బుధవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా నూతన పార్లమెంటు భవనంలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ‘‘ఆవాస్ యోజన పథకం ద్వారా సామాన్యులకు నీడ కల్పిస్తున్నాం. 4.10 కోట్ల మందికి పక్కా ఇళ్లను నిర్మించాం. పదేళ్లలో వేలాది ఆదివాసీ గ్రామాలకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాం. ఉజ్వల కనెక్షన్లు 10 కోట్లు దాటాయి. రూ.7లక్షల వరకు వార్షిక ఆదాయాన్ని కలిగిన వారికి పన్ను లేకుండా చేశాం. సామాన్యులకు భారం పడకుండా పన్ను సంస్కరణలను తీసుకొచ్చాం’’ అని ఆమె వెల్లడించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ ద్వారా 10 కోట్ల మంది రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా కార్యక్రమాలు మన దేశానికి బలాలుగా మారాయన్నారు. ‘‘మహిళా సాధికారత కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి వల్ల దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది మహిళలు స్వయం సమృద్ధి సాధించారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించే ‘నారీశక్తి వందన్ అధినియమ్’ బిల్లును ఆమోదించుకున్నాం’’ అని రాష్ట్రపతి తెలిపారు.
సమ్మక్క- సారక్క గిరిజన యూనివర్సిటీ..
తెలంగాణలో సమ్మక్క- సారక్క గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కానుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు. భగవాన్ బిర్సా ముండా జన్మదినాన్ని ‘జన్ జాతీయ దివస్’గా జరుపుకొంటున్నట్లు ఆమె తెలిపారు. ఆదివాసీ యోధులను స్మరించుకోవడం గర్వకారణమన్నారు. ‘‘శతాబ్దాలుగా దేశ ప్రజలు కలలు కంటున్న అయోధ్య రామమందిర నిర్మాణం సాకారమైంది. ఎన్నో ఆటంకాలను అధిగమించి ఆలయాన్ని ప్రారంభించాం’’ అని రాష్ట్రపతి చెప్పారు. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత 13లక్షల మంది బాలక్‌రామ్‌ను దర్శించుకున్నారని వివరించారు. అండమాన్, లక్షద్వీప్ వంటి ప్రాంతాలపైనా పర్యాటకులకు ఆసక్తి పెరిగిందన్నారు. ‘‘గతేడాది మన దేశం ఎన్నో ఘనతలు సాధించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఆదిత్య ఎల్-1 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించింది. జీ20 సమావేశాలను ఘనంగా నిర్వహించుకున్నాం. కొత్త క్రిమినల్ చట్టాలను తీసుకొచ్చాం’’ అని రాష్ట్రపతి తెలిపారు.
గుర్రపు బగ్గీలో రాష్ట్రపతి..
అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బ్రిటీష్ కాలం నాటి చారిత్రక గుర్రపు బగ్గీలో రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంటు వద్దకు చేరుకున్నారు. ఈ బగ్గీలో రాష్ట్రపతి పార్లమెంటుకు రావడం.. 40ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. లోగ్‌సభ స్పీకర్ ఓం బిర్లా చారిత్రక సెంగోల్ రాజదండంతో రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ఇక 14 మంది ఎంపీలపై గతంలో విధించిన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీరిలో 11 మంది రాజ్యసభ సభ్యులు, ముగ్గురు లోక్‌సభ సభ్యులు ఉన్నారు.
Read More..