కాంగ్రెస్‌లో ఆ పార్టీ విలీనం.. ఢిల్లీ వేదికగా కీలక పరిణామం

by Hajipasha |
కాంగ్రెస్‌లో ఆ పార్టీ విలీనం.. ఢిల్లీ వేదికగా కీలక పరిణామం
X

దిశ, నేషనల్ బ్యూరో : బిహార్‌లో రాజకీయ పరిణామాలు చకచకా మారుతున్నాయి. ఆ రాష్ట్రంలో మంచిపేరున్న రాజకీయ నాయకుడు పప్పూ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ‘జన్ అధికార్ పార్టీ’ని బుధవారం కాంగ్రెస్‌లో విలీనం చేశారు. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వేదికగా ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇటీవల ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో పప్పూ యాదవ్ భేటీ అయినప్పుడే.. ‘జన్ అధికార్ పార్టీ’ని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే టాక్ వినిపించింది. ఆ అంచనాలను నిజం చేస్తూ పప్పూ యాదవ్ హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీల ఆశీస్సులతోనే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశానని పప్పూ యాదవ్ ఈసందర్భంగా వెల్లడించారు. ఇప్పుడు మన దేశానికి రాహుల్ గాంధీని మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదన్నారు. లాలూజీ, కాంగ్రెస్‌తో కలిసి ఈ ఎన్నికల్లో బిహార్‌లో విజయఢంకా మోగిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ కూటమికి వ్యతిరేకంగా జన్ అధికార్ పార్టీని పప్పూ యాదవ్ స్థాపించారు. అంతకంటే ముందు ఆయన ఆర్జేడీ, సమాజ్‌వాదీ, లోక్ జనశక్తి పార్టీల్లో పనిచేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా ఆర్జేడీ నుంచి పప్పూ యాదవ్‌ను బహిష్కరించారు. ఈ బహిష్కరణ తర్వాతే 2015లో జన్ అధికార్ పార్టీని ఆయన స్థాపించుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed