Priyanka: ప్రజల గురించి కాకుండా స్నేహితుల అభివృద్ధికి కృషి.. మోడీపై ప్రియాంక విమర్శలు

by Shamantha N |
Priyanka: ప్రజల గురించి కాకుండా స్నేహితుల అభివృద్ధికి కృషి.. మోడీపై ప్రియాంక విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) విమర్శలు గుప్పించారు. వయనాడ్ పర్యటనలో ఉన్న ప్రియాంక.. మనంతవాడిలో జరిగిన సమావేశంలో ప్రసంగించారు. మోడీ(PM Modi) ప్రజల గురించి కాకుండా స్నేహితుల అభివృద్ధికి కృషిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాహక్కులను నిర్వీర్యం చేయాలనుకుంటున్న శక్తులపై తాము పోరాటం చేస్తుంటే.. మోడీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. దేశంలోని వ్యవస్థలను బలహీనం చేయడానికి ప్రయత్నిస్తున్న వారికి వ్యతిరేకంగా ప్రజలు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. వయనాడ్‌లో ఏర్పడ్డ వరదల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. కానీ, కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదని మండిపడ్డారు. వయనాడ్‌ ఎంపీగా అక్కడి ప్రజల అవసరాలు, హక్కుల కోసం పార్లమెంట్‌లో తన గళాన్ని వినిపిస్తాన్నారు.

ప్రతిపక్షాలను భయపెట్టే యత్నం

కేంద్ర ఏజెన్సీలతో ప్రతిపక్షాలను భయపెడుతున్నారని ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రియాంక విమర్శలు గుప్పించారు. రెండు రోజుల కేరళ పర్యటనలో భాగంగా ప్రియాంక, రాహుల్ గాంధీతో కలిసి శనివారం వయనాడ్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని పలు జిల్లాల్లో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఇక, ఇటీవల వయనాడ్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో ఎంపీగా కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా విజయం సాధించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతుండగా లోక్ సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం కూడా చేశారు.

Advertisement

Next Story

Most Viewed