- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Fadnavis: మోడీ రిటైర్ మెంట్ పై చర్చ.. సంజయ్ రౌత్ కు ఫడ్నవీస్ కౌంటర్

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) రిటైర్మెంట్‌పై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. మోడీ నాయకత్వంలో తాము ఇంకా చాలా ఏళ్లు పని చేస్తామని అన్నారు. 2029లోనూ ఆయన ప్రధానిగా సేవలందిస్తారని పేర్కొన్నారు. సమర్థవంతమైన నాయకుడు తమను నడిపిస్తున్నప్పుడు వారసుడి కోసం వెతకాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. "మా సంస్కృతిలో తండ్రి జీవించి ఉన్నప్పుడు, వారసత్వం గురించి మాట్లాడటం తగదు. దాని గురించి చర్చించాల్సిన సమయం ఇంకా రాలేదు" అని ఆయన అన్నారు. ఇదంతా "మొఘల్ సంస్కృతి" అని ఎగతాళి చేశారు. అయితే 75 ఏళ్లు దాటిన వాళ్లు రాజీనామా చేయాలని నియమం లేదని ఫడ్నవీస్ అన్నారు. ఆ'వయోపరిమితి'ని దాటిన వ్యక్తి కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారని అన్నారు. 80 ఏళ్ల బిహార్ నాయకుడు జితన్ రామ్ మాంఝీ.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిగా ఉన్నారని గుర్తుచేశారు. మరోవైపు, సెప్టెంబర్ 17న మోడీకి 75 ఏళ్లు నిండనున్నాయి.
సంజయ్ రౌత్ విమర్శలు
ఇకపోతే, ప్రధానిగా బాధ్యతలు తర్వాత తొలిసారిగా ఆదివారం నాగ్ పూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. తొలుత డా.హెడ్గేవార్ స్మృతి మందిరానికి వెళ్లిన ప్రధాని.. సంస్థ వ్యవస్థాపకుడు డా.కేశవ్ బలిరామ్ హెడ్గేవార్, రెండో సర్‌సంఘ్‌చాలక్ ఎంఎస్ గోళ్వాల్కర్‌లకు నివాళులు అర్పించారు. అనంతరం స్మృతిభవన్‌లో ఆరెస్సెస్ పదాధికారులతో భేటీ అయి వారితో గ్రూప్‌ఫొటో దిగారు. మోడీ ఆర్‌ఎస్‌ఎస్ (RSS) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ స్పందించారు. గత పదేళ్లలో ఎన్నడూ ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయానికి వెళ్లని ప్రధాని ఇప్పుడు వెళ్లడం వెనక ముఖ్యమైన కారణం ఉండొచ్చని అన్నారు. ‘‘ఆర్‌ఎస్‌ఎస్ దేశ నాయకత్వంలో మార్పును కోరుకుంటున్నట్లు నేను నమ్ముతున్నాను. వారు తదుపరి బీజేపీ చీఫ్‌ను ఎన్నుకోవాలనుకుంటున్నారు. ఆ సంస్థ నియమాల ప్రకారం మోడీ కూడా రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకుంటున్నారు. అందుకే ఆయన మోహన్ భాగవత్‌ను కలిసి రిటైర్మెంట్ పత్రాన్ని సమర్పించడానికి వెళ్లి ఉంటారు. అయితే మోడీ రాజకీయ వారసుడు మహారాష్ట్ర నుంచే వస్తాడని బలంగా నమ్ముతున్నాను’’ అని సంజయ్ రౌత్ అన్నారు.