Prashant Kishor : ఉద్దేశం మంచిదైతే.. ‘జమిలి’తో దేశానికి మేలు : ప్రశాంత్ కిశోర్

by Hajipasha |
Prashant Kishor : ఉద్దేశం మంచిదైతే.. ‘జమిలి’తో దేశానికి మేలు : ప్రశాంత్ కిశోర్
X

దిశ, నేషనల్ బ్యూరో : జమిలి ఎన్నికల(One nation one election)పై ‘జన్ సురాజ్’ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్(Prashant Kishor) కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మంచి ఉద్దేశాలతో జమిలి ఎన్నికల విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లయితే.. తప్పకుండా దానివల్ల దేశానికి మేలే జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘దేశంలో ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు గతంలో కొన్ని చట్టాలను తెచ్చారు. అయితే వాటి ద్వారా ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన వారిని లక్ష్యంగా చేసుకున్నారు’’ అని ప్రశాంత్ కిశోర్ ఆరోపించారు.

‘‘1960వ దశకం వరకు లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. అదే మళ్లీ జరగబోతోంది అంటే దేశానికి మంచిదే. అయితే ప్రస్తుత ఎన్నికల పద్ధతి నుంచి జమిలి ఎన్నికల పద్ధతికి మారిపోవడం అనేది సాఫీగా జరగాలి. ఇలాంటి మార్పు రాత్రికి రాత్రి జరగాలని కోరుకోకూడదు’’ అని ఆయన తెలిపారు.

Next Story

Most Viewed