- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కొడుకు పెళ్లి ఖర్చుపై విమర్శలు.. నీతా అంబానీ స్పందన

దిశ,వెబ్‌డెస్క్: గత ఏడాది జరిగిన అనంత్ అంబానీ(Anant Ambani)-రాధిక మర్చంట్(Radhika Merchant) వివాహ వేడుక దేశమంతా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆ వివాహ వేడుకలు కొన్ని రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకున్నాయి. ఎంతో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. రెండుసార్లు ప్రీ వెడ్డింగ్ జరపడంతో పాటు.. హాలీవుడ్ నటులతో పాటు పలువురు సెలబ్రిటీలతో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇక సోషల్ మీడియాలో అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ మ్యారేజ్ ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో పెళ్లి ఖర్చు పై కొందరు విమర్శలు వ్యక్తం చేశారు. దీనిపై రిలయన్స్ ఫౌండెషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
రూ.వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించిన తన కొడుకు అనంత్ అంబానీ(Anant Ambani) పెళ్లి వేడుక విమర్శలపై నీతా అంబానీ(Nita Ambani) స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల పెళ్లిళ్లు ఘనంగా జరిపించాలని చూస్తారని ఆమె చెప్పారు. మేము కూడా అదే చేశాం అన్నారు. చెప్పాలంటే మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్(Made in India brand)ను అందరికీ తెలియజేశారు. ఆ వేడుక సందర్భంగా భారతీయ సంస్కృతిIndian culture), సంప్రదాయాలను ప్రపంచం దృష్టికి తీసుకు వచ్చినందుకు సంతోషంగా ఉంది అని ఆమె చెప్పుకొచ్చారు.