ఉదయనిధి స్టాలిన్‌కు నిర్మలా సీతారామన్ సవాల్

by GSrikanth |
ఉదయనిధి స్టాలిన్‌కు నిర్మలా సీతారామన్ సవాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సనాతన ధర్మంపై మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇంకా రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతూనే ఉన్నాయి. ఉదయనిధి వ్యాఖ్యలపై తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్ అయ్యారు. ఉదయనిధి వ్యాఖ్యలు ప్రజల విశ్వాసాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని మండిపడిని నిర్మలా.. ఇతర మతాల్లో ఎలాంటి సమస్యలు లేవా? ఇతర మతాల్లో మహిళల పట్ల దుర్మార్గంగా వ్యవహరించం లేదా? అని నిలదీశారు. వాటిపై ప్రశ్నించే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. మీరు రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి అయ్యారని ఇతరుల విశ్వాసాలు, నమ్మకాల పట్ల గౌరవంగా నడుచుకుంటానని ప్రమాణం చేసేటప్పుడు స్పష్టంగా చెప్పారని అందువల్ల ఒకరి మతాన్ని ధ్వంసం చేస్తామనే హక్కు మీకు లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.



Next Story

Most Viewed