Nirmala Seetharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు..!

by Shiva |
Nirmala Seetharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు..!
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు (Nirmala Sitharaman) భారీ షాక్ తగలింది. పార్టీ ఫండ్ కోసం ఆమె దేశంలోని పలువురు పారిశ్రామికవేత్తలను బెదరింపులకు గురి చేసి.. వారి నుంచి పెద్ద మొత్తంలో నగదును ఎలక్టోరల్ బాండ్ల (Electoral bonds) పేరిట బీజేపీ పార్టీ అధికారిక అకౌంట్లకు బదిలీ చేశారని అభియోగాలు వెల్లువెత్తాయి. ఈ మేరకు జనాధికార సంఘర్ష పరిషత్ (Janadhikara Sangharsha Parishad) సంస్థకు చెందిన ఆదర్శ్‌ అయ్యర్‌ (Adarsh Iyyer) ఆ ఆరోపణలు ముమ్మటికీ నిజం అంటూ గతంలో ఆయన తిలక్‌నగర (Tilak Nagar) ఠాణాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మలా సీతారామన్‌పై వెంటనే కేసు నమోదు చేయాలని బెంగళూరులోని తిలక్‌నగర ఠాణా పోలీసులను చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

కాగా, ఆదర్శ్ అయ్యర్ నిర్మలపై కేసు నమోదు చేయాలని కోరగా వారు పట్టించుకోకపోవడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి సంతోశ్‌ గజానన హెగ్డే నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman)పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. అదేవిధంగా తదుపరి విచారణను అక్టోబరు 10కి వాయిదా వేశారు. అయితే, కోర్టు వేసిన మొట్టికాయలతోనైనా.. పోలీసులు నిర్మలా సీతారామన్‌‌పై కేసు నమోదు చేస్తారా లేక చూసీచూడనట్లుగా వదిలేస్తారో వేచి చూడాల్సిందే మరి.

Advertisement

Next Story