- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Nethanyahu: బందీలను విడుదల చేయకపోతే యుద్ధాన్ని తిరిగి ప్రారంభిస్తాం.. నెతన్యాహు వార్నింగ్

దిశ, నేషనల్ బ్యూరో: శనివారం మధ్యాహ్నం నాటికి బందీలను విడుదల చేయకపోతే గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం ముగుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin nethanyahu) హెచ్చరించారు. యుద్ధాన్ని తిరిగి ప్రారంభిస్తామని, హమాస్ ఓడిపోయే వరకు సైన్యం తీవ్ర పోరాటం కొనసాగిస్తుందని తేల్చి చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఆయన భద్రతా మంత్రివర్గంతో సమావేశం తర్వాత ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. సీజ్ ఫైర్ డీల్ ఒప్పందాన్ని ఉల్లంఘించి తమ బందీలను విడుదల చేయకూడదని హమాస్ ప్రకటించడం సరికాదని తెలిపారు. ఇదే జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. హమాస్ ప్రకటన విడుదల చేసిన వెంటనే గాజా స్ట్రిప్ చుట్టుపక్కల బలగాలను పెంచాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ఈ ప్రక్రియ కొనసాగుతోందని త్వరలోనే పూర్తవుతుందని వెల్లడించారు.
కాగా, కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం.. హమాస్ పాలస్తీనా ఖైదీలకు బదులుగా 21 మంది బందీలను విడుదల చేసింది. అయితే గాజాకు తగినంత సహాయం చేరుకోవడానికి ఇజ్రాయెల్ అడ్డుకుంటుందని ఆరోపిస్తూ మరో ముగ్గురు బందీల విడుదలను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలోనే నెతన్యాహు స్పందించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం స్పందించారు. ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేయకపోతే గాజాలోని ప్రతిదీ నాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. బందీలను తిరిగి ఇవ్వకపోతే, కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేయాలని సూచించారు. దీంతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.