- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నీట్’ ప్రశ్నపత్రం కోసం పోస్ట్ డేటెడ్ చెక్కులు
దిశ, నేషనల్ బ్యూరో : బిహార్‌లో నీట్ - యూజీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో దర్యాప్తు వేగంగా జరుగుతోంది. పేపర్ లీక్ మాఫియా నిర్వాహకులు ఒక్కో నీట్ ప్రశ్నాపత్రం కోసం రూ.30 లక్షల దాకా వసూలు చేశారని బిహార్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈఓయూ) ఇప్పటికే దర్యాప్తులో గుర్తించింది. తాజాగా ఆదివారం మరో సంచలన విషయం బయటపడింది. ఈవిధంగా నీట్ ప్రశ్నాపత్రాలు పొందిన వారు పేపర్ లీక్ మాఫియా సభ్యులకు భవిష్యత్ తేదీలతో పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చారని గుర్తించారు. ఈవిధమైన ఆరు చెక్కులను బిహార్‌లో నిర్వహించిన తనిఖీల్లో సేకరించారు. ఆయా చెక్కుల్లోని సమాచారం ఆధారంగా బ్యాంకులను సంప్రదించి.. ఎవరికి డబ్బులు ఇచ్చేందుకు ఆ చెక్కులు జారీ చేశారు ? ఎవరు జారీ చేశారు ? అనే సమాచారాన్ని ఈఓయూ అధికారులు సేకరిస్తున్నారు. నీట్-యూజీ 2024 పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఈఓయూ టీమ్ 13 మందిని అరెస్టు చేసింది. వీరిలో నలుగురు పరీక్ష రాసిన అభ్యర్థులు కాగా, మిగతా 9 మంది వారి కుటుంబ సభ్యులు. అందరూ బిహార్‌కు చెందినవారే.