NEET (UG)-2024: నీట్ (యూజీ) పరీక్షపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..

by Shiva |   ( Updated:2024-07-23 17:22:09.0  )
NEET (UG)-2024: నీట్ (యూజీ) పరీక్షపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..
X

దిశ, వెబ్‌డెస్క్: నీట్-యూజీ పరీక్ష రద్దు చేసి తిరిగి నిర్వహించాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్లపై మంగళవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పిటిషన్లపై సమగ్ర విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న సీజేఐ తీర్పు కాపీని చదివి వినిపించారు. నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలు ఉన్నట్లుగా గుర్తించామని తెలిపారు. హజారీబాగ్ పాట్నాలోనే పేపర్ లీక్ అయినట్లుగా తెలిపారు. ముఖ్యంగా పేపర్ లీక్‌తో బిహార్ రాష్ట్రానికి చెందిన 155 మందికి లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. ఈ విషయంలో ఐఐటీ మద్రాస్ రిపోర్టును కూడా పూర్తిగా అధ్యయనం చేశామని ధర్మాసనం వెల్లడించింది. పరీక్షలు మళ్లీ నిర్వహించాలంటూ విద్యార్థులు కోరుతున్నా.. దేశ అంతటా పేపర్ లీక్ అయినట్లుగా ఆధారాలు లేవని అన్నారు. ఒకవేళ పరీక్షను నిర్వహిస్తే 24 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. దీంతో నీట్ పరీక్ష మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం తీర్పును వెల్లడించింది. అదేవిధంగా పరీక్షలో కాపీ కొట్టిన విద్యార్థులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

Read More..

NEET (UG)-2024: ఆన్సర్ షిట్‌లో 4 మార్కులు కోత.. ఫస్ట్ ర్యాంక్ కోల్పోయిన 44 మంది

Advertisement

Next Story