- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Congress: ఛత్తీస్‌గఢ్‌లో గణనీయంగా పెరుగుతున్న నక్సల్స్ దాడులు: సచిన్ పైలట్
దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ దాడులు పెరిగిపోయాయని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ సచిన్ పైలట్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల కాలంలో నక్సల్స్ దాడులు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలాయని గణాంకాలు చెబుతున్నాయి. నక్సల్స్ దాడులతో పాటు హత్యలు, కాల్పులు జరుగుతున్నాయి. అత్యాచారాలు, కిడ్నాప్‌ల వల్ల ప్రజలు సురక్షితంగా లేరని సచిన్ పైలట్ అన్నారు. ప్రతిచోటా నేరాలు జరుగుతున్నప్పుడు, ప్రభుత్వం, పోలీసులు, ప్రభుత్వం సంఘ వ్యతిరేక వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. నేరాలు జరగడం సాధారణమే అయినప్పటికీ ప్రభుత్వం ప్రజల్లో ఆందోళనలు తగ్గించే చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఇదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరనికి కేంద్రం సమర్పించిన బడ్జెట్‌పై స్పందించిన సచిన్ పైలట్, పద్దులో 'రైతు ' అనే పదం లేదని ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ' ఈ బడ్జెట్‌తో రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న అజ్ఞానం బహిర్గతమైంది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, తమ మిత్రపక్షాలను సంతోష పెట్టేందుకు తప్పుడు వాగ్దానాలు చేశారని ఆరోపణలు చేశారు.