- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగాలాండ్‌లో శతాబ్దం తర్వాత రెండో రైల్వేస్టేషన్
కోహిమా: నాగాలాండ్ చారిత్రాక ఘట్టానికి వేదికైంది. దాదాపు 100 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో రెండో రైల్వే స్టేషన్ ప్రారంభమైంది. నూతన రైల్వే స్టేషన్ ను శోఖువిలో నిర్మించారు. సీఎం నెఫ్యూ రియో జెండా ఊపి స్టేషన్ లో డోనీ పోలో ఎక్స్‌ప్రెస్ ను ప్రారంభించారు. నాగాలాండ్ చరిత్రలో ఇదో చారిత్రత్మాకమైన రోజని ట్వీట్ చేశారు. 100 ఏళ్ల తర్వాత రెండో రైల్వే స్టేషన్ తమ రాష్ట్రంలో రూపుదిద్దుకుందని చెప్పారు. దీనిని ప్రారంభించడం సంతోషకరంగా ఉందని అన్నారు. కాగా, డోని పోలో ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజు అసోంలోని గౌహతి నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లోని నహర్లగున్ మధ్య ప్రతిరోజూ నడుస్తోంది. తాజాగా దీనిని శోఖువి వరకు పొడగించారు. దీంతో నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్‌లు శోఖువి రైల్వే స్టేషన్ వరకు దోనీ పోలో ఎక్స్‌ప్రెస్ పొడిగింపుతో నేరుగా రైలు సర్వీస్ ద్వారా అనుసంధానం కానున్నాయి. అంతకుముందు రాష్ట్ర వాణిజ్య హబ్‌గా పేరున్న దిమాపూర్‌లో 1903లో మొదటి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు.