ముస్లింలే ఎక్కువగా కండోమ్ లు వాడుతారు.. మోడీకి అసదుద్దీన్ కౌంటర్

by Dishanational6 |
ముస్లింలే ఎక్కువగా కండోమ్ లు వాడుతారు.. మోడీకి అసదుద్దీన్ కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్లతో మరోసారి వార్తల్లో నిలిచారు. దేశంలో అత్యధికంగా కండోమ్ లు వాడుతున్నదని ముస్లింలే అని అన్నారు. హైదరాబాద్ లో జరిగిన సభలో మోడీపై విమర్శలు గుప్పించారు ఏఐఎంఐఎం చీఫ్.

ఇకపోతే, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దేశ ప్రజల సంపదను ముస్లింలకు పంచిపెడతారని మోడీ విమర్శించారు. రాజస్థాన్ లోని బన్ స్వారాలో జరిగిన ర్యాలీలో మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అర్బన్‌ నక్సల్‌ మనస్తత్వం కలిగిన ఆ పార్టీ నేతలు మన తల్లులు, సోదరీమణుల మెడలోని పుస్తెలను కూడా వదిలిపెట్టరని ధ్వజమెత్తారు. తల్లులు, చెల్లెళ్ల వద్ద ఉన్న బంగారాన్ని లెక్కపెట్టి, దాన్ని పంపిణీ చేస్తామన్నారు. అంతేకాకుండా, దేశంలోని ఆస్తులపై ముస్లింలకే తొలి ఉందని గతంలో మన్మోహన్ సింగ్ సర్కారే చెప్పిందని గుర్తు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు అసదుద్దీన్ ఓవైసీ.

ముస్లింలు మెజారిటీ కమ్యూనిటీ అవుతారని ప్రధాని మోడీ హిందువులలో భయాన్ని పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతకాలం ముస్లింల పట్ల భయాన్ని సృష్టిస్తారని మండిపడ్డారు. తమ మతం వేరు కానీ.. తామంతా ఈ దేశానికి చెందినవారమే అని స్పష్టం చేశారు. ప్రజల్లో ఎందుకు విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని ప్రశ్నించారు. ముస్లింలే ఎక్కువ మంది పిల్లల్ని కంటారనే భయాన్ని ఎందుకు సృష్టిస్తున్నారని అడిగారు. ముస్లిం జనాభా పెరిగిపోతోందని మోడీ చేసిన వ్యాఖ్యల్లో ఇసుమంత కూడా నిజం లేదని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నాయని మండిపడ్డారు. ముస్లింలు ఎక్కువగా కండోమ్‌లు వాడతారని.. ఇలా చెప్పేందుకు సిగ్గుపడట్లేదని అన్నారు.

ముస్లింల జనాభా తగ్గిపోతుందని చెప్పింది తాను కాదని.. అది మోడీ ప్రభుత్వ డేటా అని స్పష్టం చేశారు. మోడీ విద్వేషాన్ని సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింల సంతానోత్పత్తి రేటు అధికంగా ఉందని చెప్పిన మోడీ.. మెజారిటీ సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.

మరోవైపు.. ప్రధాని మోడీపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్‌లో ఫిర్యాదు చేశాయి. దీనిపై వివరణ ఇవ్వాలని బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.



Next Story

Most Viewed