Mr. Beast: రియాలిటీ షో కోసం రూ. 118 కోట్లు ఖర్చు చేస్తున్న మిస్టర్ బీస్ట్..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-12-14 14:59:24.0  )
Mr. Beast: రియాలిటీ షో కోసం రూ. 118 కోట్లు ఖర్చు చేస్తున్న మిస్టర్ బీస్ట్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోని మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల(Influencers)లో మిస్టర్ బీస్ట్(Mr. Beast) ఒకరు. ఈ అమెరికన్ యూట్యూబర్ మెయిన్ ఛానల్(Channel)కు 336 మిలియన్ సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. యూట్యూబ్(Youtube)లో అత్యధికగా ఫాలోవర్లు(Followers) కలిగిన వ్యక్తిగా ఆయన మొదటి స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్(Forbes) ప్రకారం బీస్ట్ యూట్యూబ్ ద్వారా ఏడాదికి దాదాపు రూ. 4,175 కోట్లు సంపాదిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఆయన ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్(Amazon)తో కలిసి ఓ కొత్త రియాలిటీ షో(Reality show) స్టార్ట్ చేయబోతున్నారు. 'బీస్ట్ గేమ్స్(Beast Games)' పేరుతో దీన్ని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని బీస్ట్ స్వయంగా తన సోషల్ మీడియా ఎక్స్(X) వేదికగా తెలియజేశారు. ఈ రియాలిటీ షో సెట్ నిర్మించేందుకు ఏకంగా 14 మిలియన్ డాలర్లు(ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 118 కోట్లు) ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ రియాలిటీ షో డిసెంబర్ 19 నుంచి అమెజాన్ ప్రైమ్(Amazon Prime)లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ లో 10 ఎపిసోడ్స్ ఉంటాయని, విజేతకు 5 మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీ(Prize Money)గా ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా రియాలిటీ షోల చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రైజ్ మనీగా నిలవనుంది.

Advertisement

Next Story