ఎన్నికల్లో ఓటేయని ఎంపీ.. నోటీసులు జారీ చేసిన బీజేపీ

by samatah |
ఎన్నికల్లో ఓటేయని ఎంపీ.. నోటీసులు జారీ చేసిన బీజేపీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండి, ఓటు వేయనందుకు గాను జార్ఖండ్‌లోని హజారీబాగ్ బీజేపీ ఎంపీ జయంత్ సిన్హాకు పార్టీ మంగళవారం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఓటు వేయకపోవడానికి కారణాలేంటో రెండు రోజుల్లోగా స్పష్టత ఇవ్వాలని తెలిపింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ ఆదిత్య సాహు ఈ నోటీస్ జారీ చేశారు. ప్రజాస్వామ్యం గొప్ప పండుగలో.. సిన్హా ఓటు హక్కును వినియోగించుకోవడం సముచితంగా భావించడం లేదని లేఖలో పేర్కొన్నారు. ఈ వైఖరి పార్టీ ప్రతిష్టను దిగజార్చిందని తెలిపారు. ఇది ప్రజలకు కూడా తప్పుడు సందేశాన్ని పంపుతోందని చెప్పారు.రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ ఆదేశాల మేరకు నోటీస్ ఇష్యూ చేసినట్టు వెల్లడించారు. సిన్హాతో పాటు ధన్‌బాద్ ఎమ్మెల్యే రాజ్ సిన్హా, మరో ఐదుగురికి కూడా నోటీసులు పంపారు. రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వక పోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కాగా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో హజారీబాగ్ లోక్‌సభ స్థానం నుంచి మనీష్ జైస్వాల్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి జయంత్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓటు హక్కు కూడా వినియోగించుకోలేదు.

Advertisement

Next Story

Most Viewed