Students: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..

by Javid Pasha |   ( Updated:2022-09-03 10:45:56.0  )
Students: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
X

దిశ, వెబ్‌డెస్క్: స్కూల్‌కి వెళుతున్న విద్యార్థులు మోసే బ్యాగులను చూస్తే వాళ్లు చదువు కునేందుకు వెళుతున్నారా.. లేకుంటే బరువులు మోసే పనికి వెళుతున్నారా అన్న అనుమానం వస్తుంటుంది. చిన్న చిన్న పిల్లలు సైతం భారీ సైజులో ఉండే బ్యాగులను భుజాన తగిలించుకుని స్కూళ్లకు వెళుతుంటారు. అయితే ఈ విషయంపై తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. విద్యార్థులు మోసే బ్యాగు బరువును తగ్గించాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా మధ్యప్రదేశ్ సరికొత్త ఎడ్యుకేషన్ పాలసీ రాష్ట్రంలోని 1.30 లక్షల పాఠశాలల విద్యార్థులను వారానికి ఒక్కసారి బ్యాగు తీసుకెళ్లడం నుంచి కూడా మినహాయిస్తోంది.

స్కూల్ పాలసీ 2020, జాతీయ విద్యా పాలసీ ప్రకారం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ లైట్‌వెయిట్ బ్యాగు పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ ప్రకారం.. విద్యార్థుల తరగతులను బట్టి బ్యాగు బరువును నిర్దేశించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలను ప్రతి పాఠశాలలోని నోటీసు బోర్డుపై ఉంచాలని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఈ పాలసీ వెంటనే అమలులోకి రావాలని, ప్రతి పాఠశాల దీనిని తూచా తప్పకుండా పాటించాలని అధికారికంగా వెల్లడించారు. అంతేకాకుండా వారంలో ఒకరోజు బ్యాగ్ లెస్ డేగా ఉంటుందని, ఆ రోజు విద్యార్థుల ఇతర కార్యకలాపాలపై నడుస్తుందని తెలిపారు.

దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం, ఎన్‌సీఈఆర్‌టీ నిర్దేశించిన పుస్తకాలు మాత్రమే బ్యాగులో ఉండాలని, మరే ఇతర పుస్తకాలు బ్యాగులో స్కూల్‌కు తీసుకెళ్లకూడదని తెలిపారు. ఈ సరికొత్త పాలసీ ప్రకారం.. 1, 2 తరగతుల విద్యార్థల బ్యాగులు 1.6-2.2 కిలోల బరువు ఉండాలి. అదే విధంగా 3,4,5 తరగతుల విద్యార్థుల బ్యాగులు 1.7-2.5 కిలోలు ఉండాలి. 6,7 తరగతుల వారివి 2-3 కేజీలు, 8వ తరగతి వారు 4 కేజీలు, 9,10 తరగతుల వారి బ్యాగులు 2.5-4.5 కేజీల బరువు ఉండాలని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed