బీజేపీ దృష్టంతా అధికారంపైనే.. Priyanka Gandhi

by Vinod kumar |   ( Updated:2023-10-20 15:01:54.0  )
Priyanka Gandhi Tests Corona Positive
X

జైపూర్: కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారుపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ విమర్శలతో విరుచుకుపడ్డారు. ‘‘బీజేపీ దృష్టంతా అధికారంపైనే ఉంటుంది తప్ప, ప్రజా సంక్షేమంపై ఉండదు’’ అని ఆమె పేర్కొన్నారు. పారిశ్రామిక మిత్రులకు ఏదో ఒక విధంగా ప్రయోజనాలను చేకూర్చాలనే తపన బీజేపీ సర్కారులో నిత్యం జ్వలిస్తూ ఉంటుందని ఎద్దేవా చేశారు. రాజస్థాన్‌లోని దౌసా జిల్లా సిక్రాయ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రియాంకాగాంధీ ప్రసంగించారు. పేదల జేబుల నుంచి డబ్బును తీసి బడా పారిశ్రామిక వేత్తలకు ఇచ్చేయడమే బీజేపీ ప్రభుత్వాల పాలనా విధానమన్నారు.

ప్రధాని మోడీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘నిజమైన నాయకుడు వర్తమానం, భవిష్యత్తులను చూస్తాడు. పదేపదే గతం గురించి మాట్లాడడు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. అభివృద్ధి గురించి మాట్లాడకుండా.. మతం, కుల సమస్యలను మాత్రమే బీజేపీ ఎందుకు లేవనెత్తుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉందని ప్రియాంక స్పష్టం చేశారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ సుఖ్‌జీందర్ సింగ్ రంధావా, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story