వినియోగదారులను పట్టించుకోని మోడీ ప్రభుత్వం..రీచార్జి ధరల పెంపుపై కాంగ్రెస్ ఫైర్

by vinod kumar |
వినియోగదారులను పట్టించుకోని మోడీ ప్రభుత్వం..రీచార్జి ధరల పెంపుపై కాంగ్రెస్ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రయివేటు టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, వొడాఫోన్, ఎయిర్‌టెల్‌లు ఈ నెల 3 నుంచి రీచార్జ్ ప్లాన్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపడింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సూర్జేవాలా పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సెల్‌ఫోన్ సేవల చార్జీల పెంపు కారణంగా ప్రజలపై అదనపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని 109 కోట్ల మంది సెల్‌ఫోన్ వినియోగదారులు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ లను ఉపయోగిస్తున్నారని తెలిపారు. రీచార్జి ధరల పెంపుతో వీరందరిపై ఏటా రూ. 35000 కోట్ల భారం పడుతుందన్నారు. మూడు కంపెనీలు దాదాపు ఒకే శాతం టారిఫ్‌లను పెంచడం ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. ‘ఎటువంటి పర్యవేక్షణ, నియంత్రణ లేకుండా ఏకపక్షంగా సెల్ ఫోన్ టారిఫ్‌లను పెంచడానికి ప్రయివేట్ సెల్ ఫోన్ కంపెనీలకు మోడీ ప్రభుత్వం ఎలా అనుమతిచ్చింది? సెల్‌ఫోన్ వినియోగదారుల పట్ల కేంద్ర ప్రభుత్వం, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తమ బాధ్యతను ఎందుకు విస్మరించింది? అని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed