ప్రమాణస్వీకారంలో తప్పిదం.. 15 నిమిషాల్లోనే రెండుసార్లు మంత్రిగా..

by Shamantha N |
ప్రమాణస్వీకారంలో తప్పిదం.. 15 నిమిషాల్లోనే రెండుసార్లు మంత్రిగా..
X

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో గందరగోళం ఏర్పడింది. మధ్యప్రదేశ్ లో ఆరోసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామ్ నివాస్ రావత్ కేబినేట్ మంత్రిగా ప్రమాణం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ మంగూభాయ్ సి పటేల్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే, రామ్ నివాస్ తొలుత తప్పుగా ప్రమాణం చేశారు. తప్పుని గ్రహించడంతో 15 నిమిషాల్లోనే మరోసారి కేబినేట్ మంత్రిగా ప్రమాణం చేయాల్సి వచ్చింది. ఇకపోతే, రామ్ నివాస్ గ్వాలియర్-చంబల్ ప్రాంతానికి చెందిన శక్తిమంతమైన ఓబీసీ నేత‌. లోక్‌స‌భ ఎన్నిక‌లకు ముందు నుంచి బీజేపీలోకి జంప్ అయ్యారు. లోక్ సభ ఎనికల్లో కాషాయ పార్టీ మోరెనా సీటు గెలవడంతో కృషి చేశారు.

రామ్ విలాస్ ఏమన్నారంటే?

కాంగ్రెస్ అధికార ప్రతినిధి అవనీష్ బుందేలా మధ్యప్రదేశ్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. ‘‘సుపరిపాలన అని చెప్పుకునే డాక్టర్ మోహన్ యాదవ్ ప్రభుత్వంలో ఈరోజు ఇంత నిర్లక్ష్యం జరిగింది.. ఇలాంటి పొరపాటు దేశంలో మునుపెన్నడూ చూడలేదు” అని ఫైర్ అయ్యారు. ఇకపోతే, కాంగ్రెస్ విమర్శలు రామ్ విలాస్ కౌంటర్ ఇచ్చారు. “నాపై ఆరోపణలు చేసే హక్కు కాంగ్రెస్‌కు లేదు. వాళ్లు నాకు ఏమి ఇవ్వలేదు. మోహన్ యాదవ్ ప్రభుత్వం నన్ను గౌరవించింది. పొరపాటున 'క' పదం తప్పింది. అందుకే, రెండుసార్లు ప్రమాణం చేశాను.. అరగంటలో రెండుసార్లు ప్రమాణం చేసిన మొదటి మంత్రిని నేనే" అని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story