MSP: రైతులకు గుడ్ న్యూస్.. పంట కనీస మద్దతు ధర పెంపు.. క్వింటాల్ కు ఎంతంటే?

by Shamantha N |
MSP: రైతులకు గుడ్ న్యూస్.. పంట కనీస మద్దతు ధర పెంపు.. క్వింటాల్ కు ఎంతంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ముడి జనపనార (Raw Jute) పంట కనీస మద్దతు ధరను (MSP) పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో బుధవారం కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినేట్ కమిటీ భేటీ అయ్యింది. ఇక వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్ సూచనలు, సిఫార్సుల మేరకు ఈ రా జూట్ మద్దతు ధర పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించింది. క్వింటాల్‌పై రూ. 315 పెరగ్గా.. 2025-26 సీజన్‌కు సంబంధించి ఈ పంట మద్దతు ధర రూ.5650కి పెరిగినట్లు వెల్లడించింది. అంతకుముందు. 2014-15లో భారత ముడి జనపనార క్వింటాలుకు రూ.2400 ఉండగా.. అది 2025-26లో రూ.5,650కి పెరిగింది. దీంతో, క్వింటాలుకు కనీస మద్దతు ధర 2.35 రెట్లు పెరిగినట్లైంది. దీంతో ముడి జనపనార పంట పండించే రైతులు సంతోషంలో ఉన్నారు. మద్దతు ధర పెంచిన నేపథ్యంలో.. ఇతర పంటలు వేసే వారు కూడా దీనిపై ఆకర్షితులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఈ నిర్ణయం వల్ల పంట ఉత్పత్తి వ్యయం కంటే 63 శాతం ఎక్కువగా రిటర్న్స్ పొందే అవకాశం ఉందని అంచనా.

40 లక్షల కుటుంబాలకు..

40 లక్షల వ్యవసాయ కుటుంబాల జీవనోపాధి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జ్యూట్ పరిశ్రమపై ఆధారపడి ఉంటుంది. దాదాపు 4 లక్షల మంది కార్మికులు జూట్ మిల్లులలో ప్రత్యక్ష ఉపాధిని పొందుతారు. గతేడాది 1.7 లఖక్షల మంది రైతుల నుంచి జనపనారను సేకరించారు. జనపనార పండించే రైతులలో 82 శాతం మంది పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు కాగా.. అసోం, బిహార్ రైతులు 9 శాతం జూట్ ని ఉత్పత్తి చేస్తారు. అంతేకాకుండా, జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (JCI) .. ధర మద్దతు కార్యకలాపాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వానికి నోడల్ ఏజెన్సీగా కొనసాగుతుంది. ఇలాంటి సందర్భాల్లో రైతులకు ఏదైనా నష్టం సంభవిస్తే.. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రీఎంబర్స్ చేస్తుంది.

Next Story

Most Viewed