దండకారుణ్యంలో కాల్పుల మోత.. మావోయిస్టు మృతి

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-18 08:49:03.0  )
దండకారుణ్యంలో కాల్పుల మోత.. మావోయిస్టు మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్ జిల్లాలో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్‌లోని అటవీప్రాంతంలో మంగళవారం భద్రతా సిబ్బందితో జరిగిన కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్ తర్వాత ఇద్దరు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నామని.. అందులో ఒకరు గాయపడినట్లు వెల్లడించారు. రాయ్‌పూర్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న నైమెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కచ్లవారి గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఉదయం 8 గంటలకు జిల్లా రిజర్వ్ గార్డ్ బృందం సెర్చింగ్ ఆపరేషన్‌లో ఉన్నప్పుడు ఎదురుకాల్పులు జరిగాయని బీజాపూర్ పోలీసు సూపరింటెండెంట్ ఆంజనేయ వర్ష్నే తెలిపారు. ఎదురుకాల్పులు ఆగిన తర్వాత ఘటనా స్థలం నుంచి ఒక మావోయిస్టు మృతదేహాన్ని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మావోయిస్టులను అదుపులోకి తీసుకోగా, వారిలో ఒకరు గాయాలపాలైనట్లు పోలీసులు చెప్పారు. గాయపడిన మావోయిస్టును ఆస్పత్రికి తరలిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed