ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు.. మనీశ్ సిసోడియా కస్టడీ పొడిగింపు

by Shamantha N |
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు.. మనీశ్ సిసోడియా కస్టడీ పొడిగింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ నేత మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడగించింది. జూలై 15 వరకు సిసోడియా కస్టడీలోనే ఉండనున్నారు. ఆయన రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. విచారణ సందర్భంగా సిసోడియా తరపు న్యాయవాది మాట్లాడుతూ.. సీబీఐ కేసు దర్యాప్తును పూర్తి చేసిందని అన్నారు. కానీ, తమ సౌలభ్యం కోసం సీబీఐ తప్పుడు ప్రకటనలు ఇస్తోందని ఆరోపించారు. దీనిపై సీబీఐ స్పందిస్తూ.. తమ ప్రకటనలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని పేర్కొంది.

పత్రాలపై సంతకం చేసేందుకు అనుమతి

ఇకపోతే, జులై 7న సిసోడియా రిమాండ్ ముగియనుంది. దీంతో, సీబీఐ సిసోడియాను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. దీంతో, ఆయనకు జూలై 15 వరకు కోర్టు రిమాండ్ పొడిగించింది. ఎమ్మెల్యే నిధుల నుంచి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పత్రాలపై సంతకం చేసేందుకు సిసోడియాకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. కుటుంబసభ్యుల కోసం బ్యాంకు చెక్కులపైనా సంతకం చేయొచ్చని తెలిపింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సిసోయిడా అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు.

Advertisement

Next Story