బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన సిసోడియా..

by Vinod kumar |
బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన సిసోడియా..
X

న్యూఢిల్లీ: లిక్కర్ స్కాం లో కేసులో అరెస్టై సీబీఐ కస్టడీలో ఉన్న ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియా కోర్టును ఆశ్రయించారు. శనివారంతో కస్టడీ ముగియనుండడంతో బెయిల్ ఇవ్వాలని కోరారు. దీంతోపాటు సీబీఐ సిసోడియా ను ఇకపై తమ వద్ద ఉంచుకోవడానికి ప్రయత్నించకపోతే బెయిల్ అభ్యర్థనను వినమని కోర్టును కోరనుంది. నూతన లిక్కర్ పాలసీ లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో సిసోడియా ను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఆప్ ప్రభుత్వం స్కూళ్లలో సిసోడియా కు సానుకూలంగా నిరసనలు చేస్తుందని బీజేపీ ఆరోపించింది. ఐ లవ్ మనీష్ సిసోడియా పేరుతో స్కూళ్లలో కార్యక్రమాలు చేపట్టిందని విమర్శలకు దిగింది. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ దీనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే ఏ ప్రభుత్వ శాఖలోనూ ప్రభుత్వ అధికారి అలాంటి తరహా చర్యలకు పాల్పడలేదని ఆప్ కొట్టిపారేసింది. ఇదంతా బీజేపీ ఎజెండా అని దుయ్యబట్టింది.

Advertisement

Next Story