- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాకు చుక్కెదురు
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జుడీషియల్ కస్టడీని రూస్ అవెన్యూ కోర్టు మే 23 వరకు పొడిగించింది. మనీష్ సిసోడియా గత కస్టడీ గడువు ముగియడంతో ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్న ఆయనను సోమవారం రూస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో సిసోడియా కస్టడీని పొడిగిస్తూ ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే 2 వేల పేజీల చార్జ్ షీటును కోర్టులో దాఖలు చేశారు. దాదాపు రూ.622 కోట్ల మేర లావాదేవీలు జరిగాయని చార్జ్ షీట్‌లో పేర్కొంది.
కాగా మార్చి 9న సిసోడియాను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కోర్టులో సుధీర్ఘ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో మనీష్ సిసోడియా మధ్యంతర బెయిల్ కోరుతూ మార్చి 4 (గురువారం) ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఈడీకి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. విచారణ మే 11కు వాయిదా వేసింది. మధ్యంతర బెయిల్‌తో పాటు తన భార్య అనారోగ్యం కోసం తనను విడుదల చేయాలని సాధారణ బెయిల్ కూడా దాఖలు చేశారు. ఇదిలా ఉంటే సిసోసిడియా కస్టడీని పొడిగిస్తూ తాజాగా రూస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.