ఓటు బ్యాంకు రాజకీయాలకే మమతా బెనర్జీ ప్రాధాన్యత: అమిత్ షా విమర్శలు

by samatah |
ఓటు బ్యాంకు రాజకీయాలకే మమతా బెనర్జీ ప్రాధాన్యత: అమిత్ షా విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. జాతీయ భద్రతా సమస్యలకంటే ఓటు బ్యాంకు రాజకీయాలకే మమతా ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో సోమవారం జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. యూపీఏ హయాంలో ఉగ్రదాడి జరిగినప్పుడు కాంగ్రెస్, టీఎంసీలు మౌనంగా ఉన్నాయని ఆరోపించారు. చొరబాటు దారుల ఓటు బ్యాంకు కోల్పోతామన్న భయంతోనే మమతా బెనర్జీ రామమందిక శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకాలేదని విమర్శించారు. చొరబాటు దారుల ద్వారానే టీఎంసీ ఓటు బ్యాంకును సృష్టించుకుందని చెప్పారు. ప్రతిపక్షాలు ప్రజల భద్రతలను గానీ, దేశ భద్రతను గానీ పట్టించుకోవడం లేదని తెలిపారు. టీఎంసీ అవినీతి సంస్కృతిని పెంచి పోషిస్తుందని, మమతా బెనర్జీ పరిపాలనలో నేర కార్యకలాపాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అత్యధిక సీట్లు గెలవడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed