Maldivian President: భారత్ తో సంబంధాలు బలోపేతం చేస్తా

by Shamantha N |
Maldivian President: భారత్ తో సంబంధాలు బలోపేతం చేస్తా
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ తో సంబంధాలు బలోపేతం చేసేందుకు నిబద్ధంగా పనిచేస్తానని మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు అన్నారు. చారిత్రాత్మక, సన్నిహిత సంబంధాలు బలోపేతం చేసేందుకు దృష్టి సారిస్తానని అన్నారు. భారతదేశం ఎల్లప్పుడూ అత్యంత సన్నిహిత మిత్రదేశాల్లో ఒకటి అని అన్నారు. భారత్ తమకు అమూల్యమైన భాగస్వామిగా ఉందని.. అవసరమైనప్పుడు సాయం అందిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఈ విషయాన్ని మాల్దీవుల అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో విడుదల చేసింది.

28 దీవులు భారత్ కు అప్పగింత

మాల్దీవుల్లోని 28 దీవులను భారత్ కు అప్పగించింది. ముయిజ్జూ మాట్లాడుతూ.. " ఈదీవుల్లో మంచినీటి సరఫరా, నీటి పారుదల కార్యక్రమాలు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థలను పెంచుతాయి. అవి దేశశ్రేయస్సు కోసం దోహదం చేస్తాయి. ఈ ప్రాజెక్టులు భారతదేశంతో మాల్దీవుల ద్వైపాక్షిక సంబంధాలలో కీలక మైలురాళ్లు” అని అన్నారు. "భారతీయ గ్రాంట్ అసిస్టెన్స్ కింద హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లు సామాజిక-ఆర్థిక అభివృద్ధిలో రెండు దేశాల సన్నిహిత నిమగ్నతను ప్రదర్శిస్తాయని రాష్ట్రపతి నొక్కిచెప్పారు" అని పేర్కొన్నారు.

చైనాకు కటీఫ్ చెప్పిన ముయిజ్జు

ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు మాల్దీవుల అధ్యక్షుడు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు అభినందనలు తెలిపారు. ఇకపోతే, మొన్నటివరకు ఇండియా ఔట్ అంటూ ముయిజ్జూ నినాదాలు చేశారు. భారత్ కి వ్యతిరేకంగా వెళ్లి చైనా పంచన చేరారు. అయితే, నీటి సరఫరా, కూరగాయలు భారత్ పై ఆధారపడే దేశం మాల్దీవులు. దీంతో, మోడీ ప్రభుత్వం బడ్జెట్లో సాయం తగ్గించడం, జైశంకర్, త్రివిధ దళాధిపతి తీరుపై చైనాకు ముయిజ్జు దోస్తీకి కటీఫ్ చెప్పారని తెలుస్తోంది. ఇది చైనాకు పెద్ద దెబ్బే.

Advertisement

Next Story

Most Viewed