Maharashtra: ఖాతా తెరిచిన మహాయుతి కూటమి.. బీజేపీ అభ్యర్థి ఘన విజయం

by Ramesh Goud |   ( Updated:2024-11-23 09:45:53.0  )
Maharashtra: ఖాతా తెరిచిన మహాయుతి కూటమి.. బీజేపీ అభ్యర్థి ఘన విజయం
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర(Maharashtra)లో మ్యాజిక్ ఫిగర్ దాటి ఆధిక్యంలో దూసుకుపోతున్న మహాయుతి కూటమి(Mahayuti Alliance) ఖాతా తెరిచింది. మహారాష్ట్రలో బీజేపీ(BJP) మొదటి విజయాన్ని(First Victory) నమోదు చేసుకుంది. వడాల(Wadala) నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కాళిదాస్ నీలకంఠ్(Kalidas Neelakanth) భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రత్యర్థులపై 59,764 ఓట్ల మెజారిటీ(Majority) సాధించారు. కాగా మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని(BJP-led) ఎన్డీఏ కూటమి(NDA Alliance) సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలు ఉండగా.. ఇందులో మహాయుతి కూటమి ఏకంగా 200 లకు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కూటమి నుంచి ముగ్గురు అభ్యర్థులు విజయం సాధించారు.


Read More..

Maharashtra: ఖాతా తెరిచిన మహాయుతి కూటమి.. బీజేపీ అభ్యర్థి ఘన విజయం

Next Story

Most Viewed