Mahakumb: ముగిసిన మహా కుంభమేళా.. చివరి రోజున భారీగా పవిత్ర స్నానాలు

by vinod kumar |
Mahakumb: ముగిసిన మహా కుంభమేళా.. చివరి రోజున భారీగా పవిత్ర స్నానాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ (Prayag raj) నగరంలో జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా (Mahakumbamela) బుధవారం శివరాత్రి అమృత స్నానంతో ముగిసింది. 45 రోజుల పాటు జరిగిన ఈ జాతరకు భారీగా భక్తులు హాజరయ్యారు. చివరి రోజు మహా శివరాత్రి సందర్భంగా 1.44 కోట్ల మంది త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసినట్టు యూపీ ప్రభుత్వం తెలిపింది. భక్తుల రద్దీ పెరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే సీఎం యోగీ ఆదిత్యనాథ్ కుంభమేళా ఏర్పాట్లను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. మహా కుంభమేళా ముగింపు సందర్భంగా అధికారులు భక్తులపై గులాబీ పూల వర్షం కురిపించారు.

మొత్తంగా జాతరకు మొత్తంగా 66 కోట్ల మందికి పైగా హాజరైనట్టు యూపీ ప్రభుత్వం తెలిపింది. ప్రపంచంలోని హిందువుల జనాభాలో సగం మందికి సమానమైన ప్రజలు కుంభమేళాకు వచ్చారని పేర్కొంది. సగటున ప్రతి రోజూ 1.5 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేసినట్టు తెలిపింది. కుంభమేళా విజవంతానికి సహకరించిన వారందరికీ యోగీ కృతజ్ఞతలు తెలిపారు. మహా కుంభమేళా ముగింపు వేడుకలు గురువారం జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో సీఎం యోగీతో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొనున్నారు. అయితే ముగింపు తర్వాత కూడా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Next Story