ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసు తగ్గించండి .. ఎంపీ రాఘవ్ చద్దా డిమాండ్

by Prasad Jukanti |
ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసు తగ్గించండి .. ఎంపీ రాఘవ్ చద్దా డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో కనీస వయసు తగ్గించాలని రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల కనీస వయసు 25 ఏళ్లుగా ఉంది. కానీ ఈ వయసును 21 ఏళ్లకు కుదించాలని కోరారు. మనది యంగ్ ఇండియా అని భారత దేశంలో 35 ఏళ్ల కంటే తక్కువ వయసున్న జనాభా 65 శాతం, 25 ఏళ్ల లోపు వారు 50 శాతం మంది ఉన్నారని గుర్తు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారి జరిగిన ఎన్నికల్లో 40 ఏళ్లలోపు వారు 26 శాతం మంది లోక్ సభకు ఎన్నికైతే ప్రస్తుతం కేవలం 12 శాతం మందే ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో పోటీకి కనీస వయసును 21 ఏళ్లకు తగ్గించాలన్నారు.

Advertisement

Next Story