LIC Scholarship: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపటినుంచే ఎల్ఐసీ స్కాలర్​షిప్​ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-12-08 14:21:59.0  )
LIC Scholarship: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపటినుంచే  ఎల్ఐసీ స్కాలర్​షిప్​ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ బీమా రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థుల(Poor students)ను ప్రోత్సహించేందుకు గోల్డెన్ జూబ్లీ(Golden Jubilee) పేరుతో స్కాలర్​షిప్​ స్కీమ్(​Scholarship Scheme) అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్​ ద్వారా ప్రతిభ ఉండి కూడా విద్యను అభ్యసించలేకపోతున్న వారికి స్కాలర్​షిప్​ ఇవ్వనుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు తేదీలను ఎల్ఐసీ 'ఎక్స్(X)' వేదికగా శనివారం ప్రకటించింది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://licindia.in/ ద్వారా రేపటి(డిసెంబర్ 8) నుంచి అప్లై చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 22 డిసెంబర్ 2024.

ఎల్ఐసీ స్కాలర్​షిప్​ అర్హతలు..

2021-22, 2022-23 లేదా 2023-24 విద్యా సంవత్సరంలో కనీసం 60% మార్కులతో 10+2 (Inter)/ డిప్లొమా(Diploma) ఉతీర్ణులై ఉండాలి. అలాగే ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/ విద్యా సంస్థల్లో ఏదైనా డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్, డిప్లొమా, వృత్తి విద్య లేదా తత్సమానమైన కోర్సులు చేస్తుండాలి. అలాగే స్పెషల్ గర్ల్ చైల్డ్(Special Girl Child) స్కాలర్​షిప్ స్కీమ్​ కింద అప్లై చేసుకున్న వారికి రెండు సంవత్సరాల పాటు ఈ స్కాలర్​షిప్ ఇవ్వనున్నారు. టెన్త్ క్లాస్ పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్/10+2/ లేదా డిప్లొమా చేయాలనుకునే విద్యార్థినులు ఈ స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్​షిప్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు అభ్యర్థులు ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ ను సంప్రదించండి.


Click Here For Tweet..

Advertisement

Next Story