'భారత్‌లో మానవ హక్కులపై ప్రశ్నించండి'.. జో బైడెన్‌కు అమెరికా కాంగ్రెస్ సభ్యుల లేఖ

by Vinod kumar |   ( Updated:2023-06-21 11:53:30.0  )
భారత్‌లో మానవ హక్కులపై ప్రశ్నించండి.. జో బైడెన్‌కు అమెరికా కాంగ్రెస్ సభ్యుల లేఖ
X

వాషింగ్టన్‌: భారతీయ అమెరికన్‌ ప్రమీలా జయపాల్‌ నేతృత్వంలో 75 మంది అమెరికా కాంగ్రెస్ సభ్యులు ప్రెసిడెంట్ జో బైడెన్‌కు ఒక లేఖ రాశారు. భారత్‌లో మోడీ ప్రభుత్వం రాజకీయ ప్రతీకార వైఖరిని అవలంభిస్తోందని వారు ఆరోపించారు. తాము భారత్‌లోని ఏ రాజకీయ పార్టీని కానీ.. నాయకుడిని కానీ సమర్థిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం లేదని తేల్చిచెప్పారు. అమెరికా విదేశాంగ విధానంలోని ముఖ్యమైన సిద్ధాంతాలైన మానవ హక్కుల రక్షణ, మీడియా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, బహుళత్వం అనే అంశాలను మీటింగ్ సందర్భంగా మోడీకి గుర్తు చేయాలని ప్రెసిడెంట్ బైడెన్‌కు వారు విజ్ఞప్తి చేశారు.

"అమెరికాలో అమలయ్యే ఈ విధానాలను మిత్ర దేశమైన భారత్‌లో కూడా అమలు చేయాలని కోరండి" అని లేఖలో పేర్కొన్నారు. పరమత సహనం లేకపోవడం, పౌర హక్కుల నాయకులను, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకోవడం వంటి ఘటనలు భారత్‌లో ఇప్పుడు సర్వ సాధారణంగా మారాయని 75 మంది అమెరికా కాంగ్రెస్ సభ్యులు వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed