Lalu prasad yadav: లాలూ, తేజస్వీలకు షాక్..ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో ఈడీ చార్జిషీట్

by vinod kumar |
Lalu prasad yadav: లాలూ, తేజస్వీలకు షాక్..ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో ఈడీ చార్జిషీట్
X

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌లకు షాక్ తగిలింది. ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణం కేసులో వీరిద్దరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం చార్జిషీట్ దాఖలు చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే ముందు చార్జి షీట్ దాఖలు చేయగా, ఆగస్టు 13న విచారణకు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. లాలూ తేజస్వీలతో పాటు మరో 8 మంది పేర్లను కూడా చార్జిషీట్‌లో చేర్చినట్టు సమాచారం. కాగా, 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న టైంలో మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని రైల్వేలోని వెస్ట్ సెంట్రల్ జోన్‌లో జరిగిన గ్రూప్-డీ నియామకాల కేసులో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. అక్రమంగా కొందరికి జాబ్ కేటాయించగా వారు లాలూ కుటుంబానికి, వారి సహచరులకు భూములు బహుమతిగా ఇచ్చినట్టు విమర్శలు వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేయగా విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా లాలూ, నితిశ్ లపై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది.

Advertisement

Next Story