Kolkata : నిరసనల్లో పాల్గొన్న పాఠశాలలపై దీదీ సీరియస్

by Hajipasha |
Kolkata : నిరసనల్లో పాల్గొన్న పాఠశాలలపై దీదీ సీరియస్
X

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను వ్యతిరేకిస్తూ బెంగాల్‌లో ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనల్లో ఎన్నో విద్యాసంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో పాల్గొంటున్నారు. అయితే ఈ అంశాన్ని మమతా బెనర్జీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ నిరసనల్లో పాల్గొన్నందుకు హౌరా, బంకురా, మిడ్నాపూర్‌లోని పలు పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని వాటిని ఆదేశించింది.

పాఠశాలల నిర్వాహకులు నిరసనల పేరుతో విద్యార్థులను రోడ్లపై తిప్పుతూ బాలల హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఈ నోటీసుల్లో బెంగాల్ విద్యాశాఖ ఆరోపించింది. దీనిపై ఆయా పాఠశాలల నిర్వాహకుల వాదన మరోలా ఉంది. తాము పాఠశాలల సమయంలో నిరసన తెలపలేదని, స్కూల్స్ టైం ముగిశాకే నిరసన తెలిపామని వారు అంటున్నారు. నిరసనల్లో తమ పూర్వ విద్యార్థులు కూడా పాల్గొన్నారని చెబుతున్నారు.

Advertisement

Next Story