- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శివుడికి సేవ చేయడంపై మెహబూబా ముఫ్తీ స్పందన
శ్రీనగర్: శివుడికి సేవ చేయడంపై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) చీఫ్ స్పందించారు. తనకు తన మతమెంటో బాగా తెలుసని గురువారం అన్నారు. భారత్ సెక్యులర్ దేశమని.. తాను అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పారు. గంగా జమున తెహజీబ్ ను అనుసరిస్తామని మెహబూబా ముఫ్తీ తెలిపారు. కొందరు ప్రేమతో తనకు నీటిని అందజేశారని, తాను అదే గౌరవంతో శివ లింగానికి అభిషేకం చేశానని అన్నారు. తానెవ్వరి వ్యాఖ్యలపై మాట్లాడదలుచుకోలేదని.. అది తన వ్యక్తిగతమని చెప్పారు. బుధవారం పూంచ్‌లోని నవగ్రహ ఆలయాన్ని ముఫ్తీ సందర్శించారు. ఈ సందర్భంగా శివలింగానికి జలాభిషేకం చేశారు. దీనిపై బీజేపీ నేతలు, ముస్లిం పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఫ్తీ ఆలయ సందర్శన డ్రామా, జిమ్మిక్కులతో కూడుకున్నదని కాషాయ పార్టీ విమర్శించింది. ఇస్లాంలో ఇలాంటివి అనుమతించమని యూపీ డియో బాండ్ మౌలానా అన్నారు.