- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేంద్రమంత్రికి పోటీగా నామినేషన్ వేశాడని కిడ్నాప్!.. ఉపసంహరించుకోవాలని చిత్రహింసలు (వీడియో వైరల్)
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా నామినేషన్ వేసినందుకు కిడ్నాప్ చేసి చిత్ర హింసలకు గురి చేశారని చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుజరాత్ లోని గాంధీనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అఖిల భారతీయ పరివార్ పార్టీ తరుపున ఓ వ్యక్తి నామినేషన్ వేశారు. అదే స్థానం నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీ తరుపున పోటీలో ఉన్నారు. అయితే నామినేషన్ ఉపసంహరించుకోవాలని కొందరు అమిత్ షా మనుషులు తనని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేశారని, తనని చంపేందుకు ప్రయత్నించారని ఆవేధన వ్యక్తం చేశాడు.
అంతేగాక ఇప్పటికీ తనకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని భావోధ్వేగానికి గురయ్యాడు. ఈ దేశం దొంగల చేతుల్లోకి వెళ్లబోతోందని, దేశాన్ని కాపాడుకోవాలని ఈ దేశ ప్రజలను అభ్యర్ధిస్తున్నానని అన్నారు. ఈ వీడియో అందరికీ షేర్ చేసి తనని కాపాడాలని కోరాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఈ వీడియో షేర్ చేసిన వాళ్లని కూడా ఇలాగే చేస్తారేమోనని కొందరు భయపడుతుండగా, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుందని, దీనిపై ఎన్నికల సంఘం వెంటనే స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.