Wayanad Floods: వయనాడ్‌ బాధితుల రుణాలు మాఫీ చేస్తామని కేరళ బ్యాంక్ ప్రకటన

by S Gopi |
Wayanad Floods: వయనాడ్‌ బాధితుల రుణాలు మాఫీ చేస్తామని కేరళ బ్యాంక్ ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని వయనాడ్‌లో వరదలు, కొండచరియలు విరిగిపడిన విపత్తు కారణంగా ఏర్పడిన విధ్వంసం వందలాది మందిని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. అనేకమంది కుటుంబ సభ్యులను, నీడను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని జిల్లా సహకార బ్యాంకుల సమాఖ్య కేరళ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 30న వయనాడ్‌లో జరిగిన విధ్వంసకర ఘటనలో నష్టపోయిన వారి రుణాలను మాఫీ చేస్తామని సోమవారం ప్రకటనలో వెల్లడించింది. కొండపాక జిల్లాలో సంభవించిన విపత్తును దృష్టిలో ఉంచుకుని చూరల్‌మల బ్రాంచ్‌లో రుణాలు తీసుకుని చనిపోయిన రుణగ్రహీతలతోపాటు, సెక్యూరిటీలుగా తాకట్టు పెట్టిన ఇళ్లు, ఆస్తులు కోల్పోయిన వారి రుణాలను మాఫీ చేయాలని బ్యాంక్ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా, కేరళ బ్యాంక్ ఇప్పటికే ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 లక్షల విరాళం అందించింది. ఇది కాకుండా బ్యాంకు ఉద్యోగులు స్వచ్ఛందంగా ఐదు రోజుల జీతాన్ని సీఎండీఆర్ఎఫ్‌కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed