ఆ ఐదు హామీలను ఈ ఏడాది నుంచే అమలు చేస్తాం.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

by Javid Pasha |   ( Updated:2023-06-02 13:02:37.0  )
ఆ ఐదు హామీలను ఈ ఏడాది నుంచే అమలు చేస్తాం.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల సమయంలో ఇచ్చిన ఐదు గ్యారంటీలను ఈ ఏడాది నుంచే అమలు చేస్తామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. శుక్రవారం క్యాబినేట్ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్ల భాగంగా తాము ఇచ్చిన ఆ ఐదు వాగ్దానాలపై కట్టుబడి ఉన్నామని, కులమతాలకు తావులేకుండా ప్రతి ఒక్కరికి ఐదు గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు. ఒక్క గృహలక్ష్మి పథకం తప్ప మిగతా పథకాలను తక్షణమే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

గృహలక్ష్మి పథకాన్ని మాత్రం ఆగస్టు 15న ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. కాగా ఎన్నికల సమయంలో గృహలక్ష్మి, గృహజ్యోతి, అన్నభాగ్య, యువనిధి, శక్తి అనే ఐదు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అక్కడి ప్రజలకు హామీ ఇచ్చింది. అనుకున్నట్లుగానే తాజాగా సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆ ఐదు గ్యారెంటీల ఫైల్ పై సంతకం చేశారు.

Also Read..

2024 ఎలక్షన్స్.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story