Justin Bieber: ‘అంబానీ’ సంగీత్ వేడుకల్లో జస్టిన్ బీబర్.. ప్రదర్శనకు రూ. 83 కోట్లు రెమ్యూనరేషన్ అంట!

by Ramesh N |
Justin Bieber: ‘అంబానీ’ సంగీత్ వేడుకల్లో జస్టిన్ బీబర్.. ప్రదర్శనకు రూ. 83 కోట్లు రెమ్యూనరేషన్ అంట!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. జూలై 12 వ తేదీన రాధికా మర్చంట్‌ను అనంత్ అంబానీ వివాహం చేసుకోనున్నారు. ఈ పెళ్లి వేడుకలకు ప్రముఖ కెనడియన్ పాప్ సింగర్, జస్టిన్ బీబర్ హాజరు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఇవాళ ఉదయం ముంబాయి చేరుకున్నారు. ఈ రోజు ముంబాయిలో సంగీత్ కచేరీ జరగనుంది. ఈ ఈవెంట్‌కు ఆయన ప్రదర్శన ఇవ్వనున్నారు. అయితే, ఈ ప్రదర్శనకు గాను దాదాపు రూ. 83 కోట్లు తీసుకున్న సింగర్ జస్టిన్ బీబర్ భారీ రెమ్యునరేషన్ అంబానీ ఫ్యామిలీ ఆఫర్ చేసిందని జాతీయ మీడియా తెలిపింది.

కాగా, సంగీత్ ప్రొగ్రామ్‌లో తన పాటలతో బీబర్ ఆకట్టుకోనున్నారు. పాప్ సాంగ్స్ ప్రపంచంలోకి చిన్న వయసులో అడుగుపెట్టిన జస్టిన్ బీబర్ ‘ఓ బేబీ బేబీ’ అనే పాటతో ప్రపంచవ్యాప్తంగా అందరినీ అలరించాడు. భార‌త్‌లో యువత సైతం జస్టన్ బీబర్ సాంగ్స్‌ను ఎంతగానో ఇష్టపడేవారు. 2017 మొదటి సారిగా భారత్ వచ్చినా జస్టిన్ బీబర్.. తర్వాత అంబానీ ఇంట పెళ్లి వేడుకల సందర్భంగా ఇండియాకు వచ్చారు.

Advertisement

Next Story