Jharkhand Results: ఝార్ఖండ్‌లో బీజేపీకి ఊహించని షాక్.. గెలుపు దిశగా కాంగ్రెస్ కూటమి

by Shiva |   ( Updated:2024-11-23 09:47:09.0  )
Jharkhand Results: ఝార్ఖండ్‌లో బీజేపీకి ఊహించని షాక్.. గెలుపు దిశగా కాంగ్రెస్ కూటమి
X

దిశ, వెబ్‌డెస్క్: ఝార్ఖండ్ (Jharkhand) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Assembly Election Results) బీజేపీకి ఊహించని షాకిచ్చాయి. రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్‌ జరిగింది. మొదటి దశలో నవంబర్ 13న 43 స్థానాలకు, నవంబర్ 20న రెండో దశలో 38 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ (Magic Figure) 41 సీట్లు అవసరం కాగా.. ప్రస్తుతం ఆ ఫిగర్‌ను కాంగ్రెస్ కూటమి (Congress Alliance) క్రాస్ చేసి 57 స్థానాల్లో అధిక్యంలో ఉంది. మరోవైపు బీజేపీ కూటమి (BJP Alliance) 27 స్థానాల్లో లిండింగ్‌లో కొనసాగుతోంది. ట్రెండ్ ఇలానే కొనసాగితే.. ఝార్ఖండ్‌ (Jharkhand)లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

కాగా, గండే నియోజకర్గం నుంచి సీఎం హేమంత్‌ సోరెన్‌ (Hemanth Soren) భార్య కల్పనా సోరెన్‌ (Kalpana Soren) స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ధన్వార్‌లో ఝార్ఖండ్‌ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండి (Babulal Marandi), సరాయ్‌కెలాలో ఝార్ఖండ్ మాజీ సీఎం చంపయీ సోరెన్‌ (Champai Soren), ఇస్లాంపూర్‌లో ఎన్సీపీ అభ్యర్థి జయంత్ పాటిల్‌ (Jayanth Patil) ఆధిక్యంలో ఉన్నారు.


Read More..

Jharkhand Election Results: ఝార్ఖండ్‌లో నరాలు తెగే ఉత్కంఠ.. క్షణక్షణం మారుతోన్న ట్రెండ్స్

Advertisement

Next Story