- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Maoists: 9 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ఛత్తీస్‌గడ్‌లోని సుక్మా జిల్లాలో ఘటన

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్ (Chathisgarh)లోని సుక్మా (Sukma) జిల్లాలో ఇద్దరు మహిళా నక్సలైట్లు సహా తొమ్మిది మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు నక్సలైట్లపై ఒక్కొక్కరికి రూ.8 లక్షలు, నలుగురిపై రూ.5 లక్షలు, ఒక మహిళా నక్సలైట్‌పై రూ.3 లక్షలు, ఒక మగ, మరొక మహిళపై రూ.2 లక్షలు రివార్డు ఉంది. వీరందరిపై మొత్తంగా రూ. 43 లక్షల నజరానా ఉన్నట్టు సుక్మా జిల్లా పోలీసు ఉన్నతాధికారి కిరణ్ చవాన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఛత్తీస్‌గఢ్ నక్సలిజం నిర్మూలన, పునరావాస విధానం’, ‘నియాద్ నెల్ల నార్’ స్కీమ్‌తో వీరంతా ప్రభావితమై లొంగిపోయినట్టు వెల్లడించారు. వీరంతా భద్రతా బలగాలపై అనేక దాడుల్లో పాల్గొన్నారని తెలిపారు. కొంటా పోలీస్ స్టేషన్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, ఇంటెలిజెన్స్ స్క్వాడ్, 2వ, 23వ బెటాలియన్లు ఈ లొంగుబాటులో కీలక పాత్ర పోషించారని అధికారులు తెలిపారు. లొంగిపోయిన నక్సలైట్లకు పునరావాసం కోసం రూ.25000 అందజేయనున్నట్టు చెప్పారు. కాగా, గతేడాది కూడా బస్తర్ ప్రాంతంలో 792 మంది నక్సలైట్లు సరెండర్ అయినట్టు వెల్లడించారు.