Jammu Kashmir: ఫుల్ ఫ్రీడమ్.. ఉగ్రవాదులను అణచివేయండి

by Mahesh Kanagandla |
Jammu Kashmir: ఫుల్ ఫ్రీడమ్.. ఉగ్రవాదులను అణచివేయండి
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ము కశ్మీర్‌(Jammu Kashmir)లో మళ్లీ ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. భద్రతా బలగాలపై, వలస కార్మికులపై ముష్కరులు దాడులు చేస్తున్నారు. ఇదే క్రమంలో శ్రీనగర్‌లోని లాల్ చౌక్ వద్ద గ్రెనేడ్ దాడి(Grenade Attack) జరిగిన తర్వాత జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా(Manoj Sinha) భద్రతా బలగాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఉగ్రవాద సంస్థలను(Terror Outfit) అణచివేయాలని, అందుకు ఫుల్ ఫ్రీడమ్ తీసుకోండని సూచించారు. ఈ లక్ష్యాన్ని పూర్తి చేయడంలో ఏ అవకాశాన్ని జారవిడుచుకోవద్దని తెలిపారు.

ఉగ్రవాద దాడులపై కఠినంగా వ్యవహరించాలని భద్రతా బలగాలకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదివారం సూచించారు. జమ్ము కశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్, ఇతర సీనియర్ అధికారులతో మాట్లాడారు. ఉగ్రవాదులు, వారి అనుకూల ముఠాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించినట్టు అధికారిక ప్రతినిధి ఒకరు జాతీయ మీడియాకు తెలిపారు. లాల్ చౌక్ వద్ద ఆదివారం గ్రెనేడ్ దాడి జరిగింది. కట్టుదిట్టమైన భద్రత ఉండే టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్ వద్ద ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కనీసం 12 మంది పౌరులు గాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed