Jammu Kashmir: కశ్మీర్‌లో 300 కంపెనీల బలగాల మోహరింపు.. ఎన్నికల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం !

by vinod kumar |
Jammu Kashmir: కశ్మీర్‌లో 300 కంపెనీల బలగాల మోహరింపు.. ఎన్నికల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం !
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 300 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించినట్టు అధికారులు తెలిపారు. శ్రీనగర్, హంద్వారా, గందర్‌బల్, బుద్గాం, కుప్వారా, బారాముల్లా, బందిపొర, అనంత్‌నాగ్, షోపియాన్, పుల్వామా, అవంతిపోరా, కుల్గామ్‌లలో వీరందరూ విధుల్లో ఉన్నారు. కశ్మీర్ లోయలో అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సహస్త్ర సీమా బాల్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులతో సహా 298 కంపెనీల పారామిలటరీ బలగాల విధుల్లో ఉన్నట్టు వెల్లడించారు. ఇటీవల జమ్మూ కశ్మీర్‌లో అనేక ఉగ్రదాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంచనీయ ఘటనకు జరగకుండా బలగాలను అప్రమత్తం చేసింది. ఎన్నికల ప్రచారం, ఓటింగ్ ప్రక్రియ సమయంలో అభ్యర్థులను రక్షించడానికి, శాంతిని కాపాడడానికి తగినంత మంది సిబ్బందిని మోహరించినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. కాగా, మూడు దశల్లో కశ్మీర్‌లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story