మంచంపై నోట్ల కట్టలు.. లెక్కపెట్టలేక మొరాయించిన మెషిన్స్.. చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఐటీ దాడులు

by Ramesh N |   ( Updated:2024-05-20 13:04:24.0  )
మంచంపై నోట్ల కట్టలు.. లెక్కపెట్టలేక మొరాయించిన మెషిన్స్.. చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఐటీ దాడులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు చెప్పుల వ్యాపారులకు చెందిన 14 చోట్ల ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. దాదాపు 42 గంటల్లోనే రూ. 100 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే వారి ఇళ్లలో డబ్బులు చూసి అధికారులే షాక్ అయ్యారు. ఇళ్లల్లో ఏ మూలన చూసిన నోట్ల కట్టలు ఉండటంతో అధికారులు కంగుతిన్నారు. వ్యాపారుల బెడ్‌లు, కప్‌బోర్డ్‌లు, బ్యాగులు, షూ బాక్సుల్లో డబ్బులు దాచారు. ఆ డబ్బులను లెక్కపెట్టుందుకు తెచ్చిన మెషిన్లు వెడెక్కి మొరాయించాయి.

ఆదాయపు పన్ను దర్యాప్తు బృందం శనివారం ఉదయం 11 గంటలకు ఆగ్రాలోని 14 ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఎమ్​జీ రోడ్‌కు చెందిన బీకే షూస్, ధాక్రాన్‌కు చెందిన మన్షు ఫుట్‌వేర్, ఆసఫోటిడా మండికి చెందిన హర్మిలాప్ ట్రేడర్స్‌కు చెందిన కార్యాలయాలు, ఇళ్లల్లో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఆగ్రా, లక్నో, కాన్పూర్, నోయిడాకు చెందిన అధికారులు, ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, పోలీసులు ఉన్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.100 కోట్ల నగదును డిపార్ట్‌మెంట్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు సోమవారం తెలిపారు. నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలు, కోట్ల విలువైన భూముల్లో పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను కూడా డిపార్ట్‌మెంట్ గుర్తించినట్లు వారు తెలిపారు.

Advertisement

Next Story